“BJPలో BRS విలీనం చేసే కుట్ర!” – ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

"BJPలో BRS విలీనం చేసే కుట్ర!" – ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తీవ్ర ఆరోపణలతో రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. “BRSను BJPలో విలీనం (Merger) చేయాలన్న కుట్ర జరుగుతోంది” అని ఆమె ఆరోపించడం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

గురువారం ఉద‌యం మీడియా చిట్‌చాట్‌లో క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను జైలు (Jail)లో ఉన్న సమయంలో ఈ విలీన ప్రతిపాదన తన ముందు ఉంచినట్లు వెల్లడించారు. “జైలులో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన చేశారు, కానీ నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకించాను” అని ఆమె స్పష్టం చేశారు. అంతేకాక, తన చేతివ్రాతలో రాసిన ఒక లేఖ బయటకు వచ్చిన విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆ లేఖను ఎవరు బయటపెట్టారో తెలుసుకోవాలి” అని ఆమె డిమాండ్ చేశారు. “ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాటలు అనిపిస్తే ఏం వస్తుంది?” అని ప్రశ్నించారు. జైలుకు వెళ్లిన సమయంలో తాను పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని అనుకున్నప్పటికీ, BRS అధినేత కేసీఆర్ (KCR) ఆమెను ఆపినట్లు వెల్లడించారు. “కేసీఆర్ గారు వద్దని చెప్పి, రాజీనామా (Resign) చేయకుండా ఆపారు” అని ఆమె తెలిపారు.

“నేను సూటిగా మాట్లాడతా..వెన్నుపోటు రాజకీయాలు చేయను. ఆంధ్రజ్యోతి (Andhra Jyothy Newspaper)లో నాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ వార్తలు రాయిస్తారా?. నాపై పడి ఏడిస్తే ఏమొస్తుంది?. పార్టీలో కోవర్టులు (Covert Operatives) నన్ను ఎంపీ(MP)గా ఓడగొట్టారు. దేశం బయట సోషల్ మీడియా సెల్ పెట్టుకుని నాపై దాడులు చేస్తా అంటే ఎలా?. మీ తెలివితేటలు ప్రతిపక్ష పార్టీలపై చూపించండి. లీకు వీరులను పట్టుకోమంటే..గ్రీకువీరులు నామీద దండెత్తారు. నాకు నీతులు చెప్తున్న వాళ్లు నీటి వివాదంపై మాట్లాడితే బాగుంటుంది. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదు. ముందొకటి..వెనుక మరొకటి మాట్లాడను. పార్టీ వేదికలపై మాట్లాడాలంటున్నారు…పార్టీ ఫోరమ్ లో ఏముంది? అందుకే బయట మాట్లాడుతున్నాను”.

“నేను కేసీఆర్ లాగా తిక్కదాన్ని.. నేను ఎవరికి భయపడను. ప్రతిసారి కేసీఆర్ చూడగానే లేఖలు చించేస్తారు..కానీ ఈసారి ఏమైందో లేఖ బయటకు వచ్చింది. నేను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఎలా లీక్ అయింది. నామీద ఢిల్లీలో ఉన్నప్పుడే కుట్రలు మొదలయ్యాయి. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినప్పుడు ఊరూరా నిరసనలు చేయాలి కానీ, బీఆర్ఎస్ వాళ్లు ఆ పని చేయలేదు. పార్టీని నడిపించే సత్తా మీకు లేదు..నాకు నీతులు చెబుతున్నారా..? పార్టీ చేయాల్సిన పనులు సగం నేనే చేస్తున్నాను. నేను కాంగ్రెస్ తో 2013లో మాట్లాడాను.. అప్పటి నుంచి ఇప్పటివరకు మాట్లాడలేదు. కాంగ్రెస్ మునిగిపోయే నావ. ఆ పార్టీతో రాయబారాలు నాకెందుకు. బీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు. ఇంకెవరి నాయకత్వం నేను అంగీకరించను. నాది బీఆర్ఎస్ పార్టీ. కడుపులో బిడ్డను పెట్టుకొని తెలంగాణ కోసం ఊరూరా తిరిగా” అని ఎమ్మెల్సీ క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment