---Advertisement---

ఆ యాంక‌ర్‌కు సీఎం పేరు తెల్వ‌దా..? – ఎంపీ కిర‌ణ్ మండిపాటు

ఆ యాంక‌ర్‌కు సీఎం పేరు తెల్వ‌దా.. - ఎంపీ కిర‌ణ్ మండిపాటు
---Advertisement---

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి పేరు మ‌రిచిపోయిన యాంక‌ర్‌పై నోరుపారేసుకున్నారు కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి. కార్య‌క్ర‌మానికి హోస్ట్‌గా చేసేముందు ఇచ్చే కాగితంలో ఉన్న పేరు కూడా చ‌ద‌వ‌డం రాదా.. ఆ యాంకర్‌కు చ‌దువు రాదా, క‌నీస అవ‌గాహ‌న లేకుండా యాంక‌రింగ్ ఎలా చేస్తాడ‌ని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు ఎంపీ కిర‌ణ్ కుమార్ రెడ్డి.

ఇటీవ‌ల హైటెక్స్‌లో ప్ర‌పంచ తెలుగు మహాసభలు ఘనంగా జరిగాయి. మ‌హాస‌భ‌ల చివ‌రి రోజు సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. ముఖ్య‌మంత్రికి స్వాగ‌తం ప‌లుకుతూ యాంకర్ బాల ఆదిత్య.. సీఎం పేరు త‌ప్పుగా (రేవంత్‌కు బ‌దులు కిరణ్ కుమార్) ప‌లికాడు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా గట్టిగా కేక‌లు వేయ‌డంతో గందర గోళం ఏర్పడింది. ఆ వెంట‌నే క్ష‌మాప‌ణ కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి స్వాగ‌తం అంటూ కవర్ చేశాడు. ఆ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్‌కు అవమానం జ‌రిగింద‌ని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి.

ఈ ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. తెలుగు రాష్ట్రాల్లో సీఎం ఎవరో తెల్వనోడు యాంకర్ ఎలా అవుతాడని ప్ర‌శ్నించారు. యాంక‌ర్‌కు చ‌దువు రాదా? మనం చిన్న చిన్న కార్యక్రమాలకు వచ్చేటప్పుడు ఏం మాట్లాడాలో రాసుకుని వస్తాం.. అలాంటిది, ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ఆయన పేరు, ఆ కార్యక్రమం ఏంటనేది కనీసం అవగాహన లేకుండా యాంకరింగ్ చేస్తాడా అంటూ మండిపడ్డారు. దీని వెనకాల ఏదో కుట్ర ఉందని కూడా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment