---Advertisement---

ఎమ్మెల్యేలు నెలకు రూ.25 వేలు ఇవ్వాల్సిందే.. CLP మీటింగ్ లో కీలక నిర్ణయం

---Advertisement---

హైదరాబాద్‌ (Hyderabad) నోవోటెల్‌ (Novotel) లో జరిగిన కాంగ్రెస్ శాసన మండలి పార్టీ(CLPL) సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) తన జీతం (Salary) నుంచి నెలకు రూ.25 వేలు ఇవ్వాల్సిందేనని పార్టీ నిర్ణయించింది. పార్టీ ఖర్చులకు, కార్యకలాపాలకు ఈ నిధులను వినియోగించనున్నారు.

పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దు
ఇకపై ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రజల్లో ఉండాలని, గ్రామాల్లో తిరిగి వారి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. ఎవ్వరూ పార్టీ లైన్ (Party Line) దాటి మాట్లాడకూడదని స్పష్టం చేశారు. పార్టీని బ్లాక్‌మెయిల్ చేసే ధోరణిని సహించమన్నారు. ప్రస్తుతం పార్టీ భయపడే స్థితిలో లేదని, అద్దంకి దయాకర్‌ (Addanki Dayakar) లాగే ఓపికతో వ్యవహరించాలని చెప్పారు.

ఓపిక ఉంటేనే పదవులు.. : CM రేవంత్ రెడ్డి

“దయాకర్ ఓపికతో ఉన్నాడు కాబట్టే ఎమ్మెల్సీ అయ్యాడు. అందరూ అదే విధంగా ఉండాలి” అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ (High Command) నిర్ణయిస్తుందని, ఎవ్వరూ ఈ విషయంపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ‘స్వీట్ వార్నింగ్ (Sweet Warning)’ ఇచ్చారు.

నాలుగు కీలక అంశాలపై చర్చ
ఈ సమావేశంలో ప్రధానంగా భూభారతి (Bhu Bharati), సన్నబియ్యం పంపిణీ (Fine Rice Distribution), ఇందిరమ్మ ఇళ్ల పునఃప్రారంభం (Indiramma Housing Restart), ఎస్సీ వర్గీకరణ (SC categorization) అంశాలపై చర్చించారు. ఇవన్నీ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై నేతలు తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు. ఈ CLP భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి జపాన్ (Japan) పర్యటనకు బయలుదేరనున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment