---Advertisement---

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ట‌మాటాల‌తో దాడి

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ట‌మాటాల‌తో దాడి
---Advertisement---

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఊహించని చేదు అనుభవం ఎదుర్కొన్నారు. కమలాపూర్‌లో నిర్వహించిన గ్రామసభలో భాగంగా, ఆయనపై కాంగ్రెస్ శ్రేణులు టమాటాలతో దాడి చేశాయి. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు అంశంపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుండగా, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్యలో లేని కొన్ని అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. దీంతో గ్రామ‌సభ‌లో ఉద్రిక్తత పెరిగింది.

బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం దాటికి, పరిస్థితి అదుపు తప్పింది. ఈ ఘర్షణ కాస్త బాహాబాహీగా మారింది. ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి చేయడంతో​ బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతిగా కాంగ్రెస్‌ కార్యకర్తలపైకి కుర్చీలు విసిరారు. దీంతో, ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అక్కడున్న పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు. అనంతరం, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో పెద్ద‌సంఖ్యలో పోలీసులు గ్రామసభ వద్దకు చేరుకున్నారు. ఈ ఘటన రాజకీయంగా సంచలనం సృష్టించడంతో పాటు, పల్లెస్థాయిలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ శ్రేణుల మ‌ధ్య రాజ‌కీయ తగాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూపించింది.

ఇటీవ‌ల కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న గ్రామ స‌భ‌ల ద్వారా ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఏ మేర‌కు ఉందో అద్దం ప‌డుతోంద‌ని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ప్ర‌తి స‌భ‌లోనూ ప్ర‌జ‌లు కాంగ్రెస్ ప్ర‌భుత్వ హామీల అమ‌లుపై నిల‌దీత‌లు మొద‌ల‌య్యాయ‌ని, దీనికి గ్రామ స‌భ‌లే సాక్ష్యం అంటూ ఇటీవ‌ల కేటీఆర్ ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment