---Advertisement---

ఫొటోలు డిలీట్‌.. మ‌ళ్లీ తెర‌పైకి ‘కలర్స్’ స్వాతి విడాకుల ఇష్యూ

ఫొటోలు డిలీట్‌.. మ‌ళ్లీ తెర‌పైకి ‘కలర్స్’ స్వాతి విడాకుల ఇష్యూ
---Advertisement---

సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితం ఎప్పుడూ నెటిజన్లకు ఆసక్తి కలిగించే అంశంగా మారుతుంది. తాజాగా, హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి గురించి ఓ ఆసక్తికరమైన విషయం చర్చనీయాంశమైంది. క‌లర్స్ ప్రోగ్రామ్‌తో పాపుల‌ర్ అయిన స్వాతి, ఆ పేరునే త‌న ఇంటిపేరుగా మార్చుకున్నారు. బుల్లితెర నుంచి సినిమాల్లోకి వ‌చ్చిన స్వాతి హీరోయిన్‌గా న‌టించి ఫేమ‌స్ అయ్యారు. త‌రువాత పెళ్లి చేసుకొని అప్పుడ‌ప్పుడు సిల్వ‌ర్ స్కీన్‌పై ద‌ర్శిస్తున్న స్వాతి.. ఇప్పుడు మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు.

హీరోయిన్ స్వాతి తన భర్త వికాస్ వాసుతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. ఇది చూసిన నెటిజన్లు, ఆమెకు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయేమోనని, విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నారని భావిస్తున్నారు.

గతంలోనూ, స్వాతి నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ చిత్ర ప్రమోషన్స్ సమయంలో ఇలాంటి రూమర్లు వ్యాపించాయి. కానీ ఆ సమయంలో స్వాతి స్పందించడం నివారించారు. ఇప్పటివరకు స్వాతి ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో, వార్తలపై సందిగ్ధత కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment