మటన్ సూప్‌లో బొద్దింక‌.. క‌స్ట‌మ‌ర్ షాక్‌! (వీడియో)

మటన్ సూప్‌లో బొద్దింక‌.. క‌స్ట‌మ‌ర్ షాక్‌! (వీడియో)

బ‌ర్డ్‌ఫ్లూ భ‌యంతో చికెన్ ఐట‌మ్స్‌కి కొంత గ్యాప్ ఇచ్చిన‌ ఫుడ్ ల‌వ‌ర్స్‌కి మ‌ట‌న్ సేఫేనా అనే డౌట్ వ‌స్తోంది. తాజా సంఘ‌ట‌న మాంసాహార ప్రియుల‌ను షాక్‌కు గురిచేస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలో గ‌ల అరేబియన్ మండీ రెస్టారెంట్‌లో ఓ కస్టమర్ మటన్‌ సూప్‌ ఆర్డర్‌ చేశాడు. ఆకలితో ఎదురుచూస్తూ, సూప్‌ వచ్చాక చెంచా పెట్టి తినబోయాడు. కానీ, మటన్ ముక్క‌ల బదులు బొద్దింక క‌నిపించ‌డంతో అవాక్క‌య్యాడు. వెంటనే ఈ విషయాన్ని రెస్టారెంట్‌ యాజమాన్యానికి చెప్పినా, వారు నిర్లక్ష్యంగా స్పందించడంతో ఆ కస్టమర్‌ ఇంకా అసహనానికి గురయ్యాడు.

ఈ ఘటనపై సామాజిక కార్యకర్త రాబిన్ జక్కీయస్ స్పందించి వీడియోను సోషల్ మీడియా ద్వారా వైరల్‌ చేశారు. అహార భద్రత విషయంలో రెస్టారెంట్ల నిర్లక్ష్యంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశుభ్రత లేకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని GHMC అధికారులను ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment