SLBC టన్నెల్‌ వ‌ద్ద‌కు సీఎం రేవంత్ రెడ్డి

SLBC టన్నెల్‌ వ‌ద్ద‌కు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వనపర్తి పర్యటన అనంతరం SLBC టన్నెల్‌ను సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 11.30 గంటలకు వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహిస్తారు. ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ, పుణ్యక్షేత్ర అభివృద్ధి దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ZPHS పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 2.15 గంటలకు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభించి, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడంతో పాటు రుణ మేళా, ఉద్యోగ మేళాలలో పాల్గొంటారు.

సాయంత్రం 5 గంటలకు SLBC టన్నెల్‌కు చేరుకుని, అక్కడి సహాయక చర్యలను స్వయంగా పరిశీలిస్తారు. బాధిత కుటుంబాలకు ఆపన్నహస్తాన్ని అందించడంతో పాటు ప్రభుత్వ అధికారులు, రెస్క్యూ బృందాలతో చర్చించి తదుపరి చర్యలపై స్పష్టమైన మార్గనిర్దేశం చేస్తారు.

Join WhatsApp

Join Now

Leave a Comment