ఢిల్లీ (Delhi)లో కేంద్ర మంత్రుల (Central Ministers)తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy),, తన పాలనపై విమర్శలు చేస్తున్న బీజేపీ(BJP), బీఆర్‌ఎస్(BRS) నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కేంద్రంతో చర్చలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. “నేను పక్క రాష్ట్రం సీఎంతో మాట్లాడితే తప్పేంటి?” అని ప్రశ్నిస్తూ, బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపారు. తాను ఇప్పటికే మూడు సమస్యలను పరిష్కరించానని, మిగిలిన వాటిపై సాంకేతిక నిపుణుల కమిటీ చర్చిస్తుందని వివరించారు. ప్రజలు తనకిచ్చిన అధికారాన్ని ఉపయోగించి రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం తన బాధ్యత అని, ఫామ్ హౌస్‌లో కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావని కేసీఆర్‌ను పరోక్షంగా విమర్శించారు.
కేటీఆర్(KTR) నాయకత్వాన్ని ఆయన సోదరి (కవిత)(Kavitha) కూడా అంగీకరించడం లేదని, గతంలో సవాల్ విసిరితే పారిపోయారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. “గంజాయి బ్యాచ్‌కి నేను భయపడను. భయపడి ఉంటే నేను రేవంత్ రెడ్డి అవుతానా?” అని ఘాటుగా స్పందించారు. కేటీఆర్ డ్రగ్స్ కేసు, గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతోందని, “విలన్లు క్లైమాక్స్‌లోనే అరెస్ట్ అవుతారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డికి బీసీ రిజర్వేషన్లపై సవాల్ విసిరారు.
తనపై ఉన్న కేసులపై హడావుడి చేయనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. బీజేపీ సీబీఐ కేసులతో రాజకీయం చేయాలని చూస్తోందని ఆరోపించారు. రెండేళ్ల తర్వాత కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టులను తిరిగి భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు.