తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందం విదేశీ పర్యటన కోసం సింగపూర్ చేరుకుంది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.
పర్యటనలో కీలక కదలికలు
సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను సందర్శించి, నైపుణ్యాభివృద్ధి కోసం అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయనున్నారు. అనంతరం మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించి సింగపూర్ రివర్ ఫ్రంట్‌ను పరిశీలించనున్నారు.
దావోస్ సదస్సు..
సింగపూర్ పర్యటన తరువాత, సీఎం బృందం దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో పాల్గొననుంది. 2023 దావోస్ పర్యటనతో తెలంగాణకు రూ. 40 వేల కోట్ల పెట్టుబడులను సమీకరించిన తెలంగాణ ప్రభుత్వం, ఈసారి మరింత పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకుంది.