సంగారెడ్డి జిల్లా (Sangareddy District) పటాన్‌చెరు (Patancheru) సమీపంలోని పాశమైలారం (Pashamylaram పారిశ్రామిక వాడ (Industrial Area)లో సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఘోర పేలుడు రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
“పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదం (Fire Accident) కలచివేసింది. ఈ ప్రమాదంలో అమాయకులైన కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులను ఆదేశించాను. ప్రభుత్వంగా మేము బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.”
మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం(CM) హామీ ఇచ్చారు. ప్రమాదానికి గురైన కార్మికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
అలాగే ఈ ఘటనపై సంపూర్ణ నివేదికను త్వరితగతిన అందజేయాలంటూ సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతి చెందగా, మరెందరో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైపోయిన స్థితిలో ఉండగా, రెస్క్యూ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.