రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు పుడుతలేదు.. ఎవడూ అణాపైసా ఇస్తలేడు.. బ్యాంకర్లు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను (Telangana State Representatives) దొంగలను (Thieves) చూసినట్టు చూస్తున్నరు. ఢిల్లీకి (Delhi) పోతే వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుక పోయేటట్టున్నడని ఎవడు కూడా అపాయింట్‌మెంట్ (Appointment) ఇస్తలేడు. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి ఇచ్చేటోన్ని. ఎవడూ బజార్ల నమ్ముతలేడు. నన్ను కోసినా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం జేస్తరయ్యా నన్ను.. చెప్పుండ్రి? ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్న ఏంజేస్తరు నన్ను? కోసుకొని వండుకొని తింటరా? ఏం జేస్తరు?
సీఎం మాట్లాడాల్సిన మాటలేనా..?
తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చేసిన సంచలన వ్యాఖ్యలివి. సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం మాటలపై రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అని కొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకుంటాయా..? అనే కొత్త చర్చకు దారి తీశాయి సీఎం మాటలు. ఉద్యోగ సంఘాల డిమాండ్లపై నోరుపారేసుకోవడం దారుణమని, మొత్తం రాష్ట్ర ప్రతినిధులను, పౌరులను కించపరిచేలా సీఎం మాట్లాడారంటూ ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.
HELICOPTERS have become Share Auto in Telangana as Congress Ministers are flying even for 100 kilometres distance to attend MLA's birthday functions…
— Dr.Krishank (@Krishank_BRS) May 6, 2025
7 Foreign Holidays, 43 Times to Delhi,
CM Revanth didnt bring a single rupee, he should release his own,his managers and staff… pic.twitter.com/qvZgNuNxW6
ఉచిత బస్సు తప్ప.. ఏమైనా ఉందా..?
ఏడాదిన్నర పాలనలోనే కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని, రాష్ట్రానికి నిధులు లేవు, అప్పులు పుట్టడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు గ్రామస్థాయికి చేరాయి. సీఎం మాటలపై ఊర్లలో చర్చ మొదలైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం తప్ప ప్రజలకు చేసిన మేలు ఏమైనా ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు అండగా, భరోసాగా మాట్లాడాల్సిన వ్యక్తి నన్ను కోసుకొని వండుకొని తింటరా..? అని మాట్లాడడం ఏంటని రాజకీయ విశ్లేషకులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మాట్లాడిన ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని అంటున్నారు.
సోషల్ మీడియాలో ట్రోలింగ్..
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. సీఎం చేతులెత్తేశాడన్న మీమ్స్, రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. గ్రామాలు, పట్టణాల నుంచి ప్రభుత్వానికి చేరే ఆదాయానికి సొంత పార్టీ నేతలు గండి కొడుతున్నా.. సీఎం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ప్రత్యేక హెలికాప్టర్లలో ఆకాశంలో విహరించడానికి డబ్బులుంటాయి కానీ, ప్రజల వరకు వచ్చేసరికి డబ్బులు, అప్పులు గుర్తుకు వస్తాయా..? అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో అందాల పోటీలకు, ఢిల్లీ పర్యటనలకు, మూసీ, భూభారతి అధ్యయనాలకు ఖర్చు పెట్టేందుకు డబ్బులు ఉంటాయి కానీ, వృద్ధులకు పింఛన్లు పెంచడానికి ఉండవా..? అని సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాలు, సోషల్ మీడియా, గ్రామస్థాయి ప్రజల నుంచి సీఎం వ్యాఖ్యలపై ముప్పెట దాడి జరుగుతుంది. మరి సీఎం రేవంత్‌రెడ్డి ఎలా సమర్థించుకుంటారో చూడాలి.







