---Advertisement---

అల్లు అర్జున్ పేరు మర్చిపోతే నేను ఫీల్ అవుతానా?`

అల్లు అర్జున్ పేరు మర్చిపోతే నేను ఫీల్ అవుతానా?`
---Advertisement---

ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వార్తపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ పుష్ప‌2 ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోయారన్న కారణంతో అత‌న్ని అరెస్టు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై సీఎం రేవంత్ సూటిగా స్పందించారు.

“ఎవరో నా పేరు మర్చిపోతే నేను ఫీల్ అవుతానా? అలాంటి అసత్య ప్రచారాలను నమ్మకండి. నా స్థాయి అలాంటిది కాదు” అని ఆయన వివ‌ర‌ణ ఇచ్చారు. అలాగే, టాలీవుడ్ పరిశ్రమకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, అలాంటి వార్తలను ఖండించాల్సిన బాధ్యత టాలీవుడ్ పెద్దలపై ఉందని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ సినీ పరిశ్రమ అభివృద్ధి కోరుకునే వ్యక్తినని ఆయన తేల్చి చెప్పారు.

సినీ పరిశ్రమ అభివృద్ధిపై సీఎం అభిప్రాయం
టాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో జరిగిన భేటీలో పరిశ్రమతో తనకు ఉన్న అనుబంధాన్ని వెల్లడించారు. సినీ పరిశ్రమ దేశాన్ని ప్ర‌భావం చేసే ఒక గొప్ప వేదిక. దాని ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ప్రయత్నాలు అసహ్యంగా కనిపిస్తున్నాయి. అందరం కలిసి నిజాలను ప్రచారం చేయాలి అని ఆయన సూచించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment