‘అఆ’లు రానోళ్లు జర్నలిస్టులు అవుతుండ్రు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

'అఆ'లు రానోళ్లు జర్నలిస్టులు అవుతుండ్రు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

‘‘అఆలు (A aa lu) (ఓనమాలు) రానోళ్లు జర్నలిస్టులంటూ (Journalist) రోడ్ల(Roads)పై తిరుగుతున్నారు!’’ అని తెలంగాణ (Telangana ) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జర్నలిజం (Journalism) విలువలు పూర్తిగా పడిపోయాయని, సోషల్ మీడియా ముసుగులో అసలు విద్యా పరిణతి లేకుండా చాలా మంది మీడియా వృత్తిని తారుమారు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ (Hyderabad)లో నిర్వహించిన ‘నవ తెలంగాణ’ (‘Nava Telangana’) దినపత్రిక 10వ వార్షికోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇవాళ ఓనమాలు రాకపోయినా, సోషల్ మీడియాలో పేజ్ ఓపెన్ చేస్తే చాలు ‘జర్నలిస్టు’ అని పిలిపించుకుంటున్నారు. అసభ్యంగా మాట్లాడుతూ, విలువలేని వ్యక్తులు కూడా ఈ వృత్తిని అపహాస్యం చేస్తున్నారు,’’ అని అన్నారు. ‘‘వారిని పక్కన పెట్టండి. కనీసం పక్కన కూర్చోబెట్టకండి’’ అంటూ సీనియర్ మీడియా ప్రతినిధులకు సూచనలు చేశారు. విలువలతో కూడిన జర్నలిజం కోసం అసత్యాలను వ్యతిరేకించాలని, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని కోరారు.

కమ్యూనిస్టులకు ఎప్పుడూ గౌరవమే
‘‘నాకు కమ్యూనిస్టులంటే ఎంతో గౌరవం ఉంది. ప్రభుత్వాల తప్పుల్ని ఎత్తిచూపడంలో, అధికారాన్ని కూలదీసేందుకు వారు చురుకుగా ఉంటారు. 2004లో కాంగ్రెస్ విజయంలో వారు కీలక పాత్ర పోషించారు,’’ అని గుర్తు చేశారు. ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటానికి కూడా కమ్యూనిస్టులే ముందు ఉంటారని అభిప్రాయపడ్డారు. ‘‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల విశ్వసనీయత ఎంత తగ్గిందో… జర్నలిస్టుల విశ్వసనీయత కూడా అదే దారిలో నడుస్తోంది’’ అని రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment