తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి మల్లారెడ్డి, పద్మారావు కూడా హాజరయ్యారు. అరగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని హరీష్‌రావు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
భేటీ అనంతరం పద్మారావు మీడియాతో మాట్లాడుతూ, తమ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రిని కలిసినట్టు తెలిపారు. ముఖ్యంగా, కేసీఆర్ మంజూరు చేసిన హైస్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్‌ను కోరగా, ఆయన వెంటనే వేం నరేందర్ రెడ్డికి ఆ పనులు చక్కబెట్టాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
డీలిమిటేషన్‌పై..
హరీష్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో నిర్వహించిన డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించినట్టు తెలిపారు. అయితే, చెన్నైలో జరిగే సమావేశానికి డీఎంకే ఆహ్వానం మేరకు హాజరవుతున్నామని స్పష్టం చేశారు. “డీఎంకే మాకు ఫ్రెండ్లీ పార్టీ, కానీ ఘోష్ కమిటీ నివేదిక గురించి నాకు తెలియదు” అంటూ వ్యాఖ్యానించారు.
కాగా, సీఎం రేవంత్‌రెడ్డి చెన్నై బయలుదేరారు. రేపు తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుండగా, ఆ సమావేశానికి రేవంత్ హాజరవుతారు. ఈ భేటీలో తెలంగాణ రాజకీయ భవిష్యత్తు దిశగా కీలక చర్చలు జరగనున్నాయా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.