తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం ప్రమాదం (Accident) నుంచి తృటిలో బయటపడ్డారు (Narrowly Escaped). సీఎం రేవంత్ ఎక్కిన లిఫ్ట్ (Lift) లో సాంకేతిక లోపం(Technical Glitch) తలెత్తింది. సెకండ్ ఫ్లోర్‌కు వెళ్లాల్సిన లిఫ్ట్ ఓవర్‌వెయిట్ (Overweight) కారణంగా అకస్మాత్తుగా కిందకు వెళ్లిపోయింది. దీంతో ఆయన కొన్ని నిమిషాల పాటు లిఫ్ట్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాద్ (Hyderabad) శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్ (Novotel Hotel) లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (Telangana Congress Party) విస్తృత స్థాయి సమావేశం (High-Level Meeting) నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. హోటల్‌లో సమావేశం జరిగే ప్రాంతానికి వెళ్లేందుకు సీఎం రేవంత్‌రెడ్డి లిఫ్ట్ ఎక్కారు. ఓవర్ వెయిట్ కావడంతో లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు వెళ్లింది. దీంతో అక్కడ ఉన్న అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. సంఘటన చోటుచేసుకున్న వెంటనే సీఎం సెక్యూరిటీ సిబ్బంది (CM’s Security Staff) తక్షణమే స్పందించి, ఆయనను బయటకు తీసుకువచ్చి, మరో లిఫ్ట్ ద్వారా సురక్షితంగా రెండో అంతస్తుకు చేర్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పెను ప్రమాదం నుంచి సీఎం రేవంత్ తప్పించుకున్నారని అంతా ఊపిరి పీల్చుకున్నారు.
“బ్రాహ్మణులపై మూత్రం పోస్తా” – అనురాగ్ కశ్యప్ వివాదాస్పద వ్యాఖ్య