కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్పరెన్స్..పలు ఆదేశాలు

కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్పరెన్స్..పలు ఆదేశాలు

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ (Telangana)లో కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains) నేపథ్యంలో జిల్లా కలెక్టర్లంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సూచించారు. సోమవారం (జులై 21) జిల్లా కలెక్టర్ల (Collectors)తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ (Video Conference)లో సీఎం రేవంత్‌ వర్షాలపై సమీక్షించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలు మరియు సూచనలు:

-జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి, అన్ని విభాగాల అధికారులను కూడా అప్రమత్తం చేయాలి.

-ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి.

-జూన్ నుండి ఇప్పటి వరకు 21 శాతం వర్షపాతం నమోదైనప్పటికీ, గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

-హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కోసం 150 బృందాలను ఏర్పాటు చేశారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా కమాండ్ కంట్రోల్ రూం నుండి సమన్వయం చేసుకుని బృందాలను ముందుగానే పంపిస్తున్నారు.

-పోలీస్ కమిషనరేట్లకు సంబంధించిన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలి.

-హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలి.

-జిల్లాల్లో పిడుగుపాటుతో జరిగే నష్టాల వివరాలను నమోదు చేయాలి.

-గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా ఐటీడీఏ ప్రాంతాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

-పీహెచ్‌సీ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.

-పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలి.

-కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందే. వారు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారు.

-అజాగ్రత్తగా ఉండే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారు.

-ప్రతీ రోజు కలెక్టర్ల కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి నివేదికను అందించాలని సీఎస్‌ను ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment