ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh సీఎం (CM) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నేడు విదేశీ పర్యటన (Foreign Tour) కు బయలుదేరుతున్నారు. అయితే, ఈ ప్రయాణానికి ముందుగా ఉదయం 11 గంటలకు 16వ ఆర్థిక సంఘం సభ్యులతో ముఖ్యమంత్రి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి ఆశిస్తున్న ఆర్థిక సాయంపై చంద్రబాబు వివరణ ఇవ్వనున్నారు.
సాయంత్రం ఆర్థిక సంఘం సభ్యులకోసం విజయవాడ (Vijayawada) లో విందు ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఢిల్లీ (Delhi)కి వెళ్లి, అక్కడినుంచి కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు పయనమవుతారు.ఈ నెల 20వ తేదీన చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఫ్యామిలీ (Family) తో కలిసి యూరప్ (Europe) లోనే జన్మదిన వేడుకలు (Birthday Celebrations) జరుపుకోనున్నారు. పర్యటన అనంతరం ఈ నెల 22న తిరిగి ఢిల్లీ చేరుకుని, 23వ తేదీన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.








