ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కేబినెట్ మీటింగ్ (Cabinet Meeting)లో ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మంత్రుల (Ministers) పనితీరుపై (Performance) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులెవరూ సంతృప్తికరంగా పనిచేయడం లేదని, ప్రజలకు చేసిన మంచిని సమర్థవంతంగా చెప్పడంలో విఫలమవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మీడియాలో లీకులొచ్చాయి. అయితే కేబినెట్ మీటింగ్‌లోనూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) పేరు ప్రస్తావనకు వచ్చింది. ఇటీవల ప్రభుత్వ, పార్టీ సమావేశాలతో పాటు కేబినెట్ మీటింగ్‌లో జగన్ పేరును తరచూ సీఎం చంద్రబాబు, మంత్రులు ప్రస్తావిస్తుండగా, ఇప్పుడు కేబినెట్ మీటింగ్‌లోనూ ప్రస్తావించడం గమనార్హం. మాజీ సీఎం రైతులను రెచ్చగొట్టి, పరిశ్రమలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం ఆరోపించారు.
మహిళా ఎమ్మెల్యేను కించపరిచిన వ్యాఖ్యలపై మంత్రులు స్పందించకపోవడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని కొన్ని మీడియా ఛానళ్లు ప్రసారం చేశాయి. ప్రతి మంత్రి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారని పేర్కొంది. కేబినెట్ మీటింగ్‌లో ఏడాది వ్యవధిలో నిత్యావసరాల ధరలు గణనీయంగా తగ్గాయని సీఎం వెల్లడించారు. ఈ విజయాన్ని ప్రజలకు సమర్థవంతంగా చెప్పడంలో మంత్రులు విఫలమయ్యారని విమర్శించారు.
అలాగే, తోతాపురి మామిడి కొనుగోళ్లు 80 శాతం పూర్తయిన తర్వాతే జగన్ హడావుడి చేస్తున్నారని, వైసీపీ కార్యకర్తలు రైతుల పొలాల నుంచి మామిడిని తెచ్చి కింద పోసి అలజడి సృష్టించారని ఆయన ఆరోపించారు. ఇండోసోల్‌కు భూమి కేటాయించవద్దని జగన్ రైతులను రెచ్చగొట్టారని, దీనివల్ల పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయని సీఎం సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలను ఆకర్షించడంలో, రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు స్పష్టంగా వివరించాలని, వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని సీఎం మంత్రులకు సూచించారు.