ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో కొందరు పోలీస్ (Police) అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఇటీవల రాప్తాడు (Raptadu) నియోజకవర్గం రామగిరి (Ramagiri) సబ్ ఇనిస్పెక్టర్ సుధాకర్ యాదవ్ (Sudhakar Yadav) వీడియోపై తీవ్ర విమర్శలు రాగా, తాజాగా కదిరి (Kadiri) టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్(CI) నారాయణరెడ్డి (Narayana Reddy) ఆడియో (Audio) సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
కదిరి సీఐ నారాయణరెడ్డి బూతు పురాణం లీక్ (Leaked) అయ్యింది. సీఐ ఆడియో వాట్సప్ గ్రూప్‌లలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఓ కేసు విషయంలో కదిరి ఆర్ఐ మున్వర్ బాషాను సీఐ నారాయణరెడ్డి విచారణకు పిలిచారు. విచారణ సందర్భంలో మున్వర్ మతాన్ని, మత గ్రంధాన్ని అవమానిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఏం అనుకుంటున్నావ్.. తమాషా చేస్తావా నా దగ్గర, ఎంప్లాయ్ అని చూస్తున్న లేకపోతే బూట్ (Boot) కాలితో తన్నేవాడ్ని, ఆర్ఐ అని గౌరవం ఇస్తున్న లేకపోతే బట్టలు ఊడతీసి డ్రాయర్‌తో కూర్చోపెడుతుంటి’ అని పరుషపదజాలంతో మాట్లాడాడు.
సీఐ వ్యవహరించిన తీరుతో ప్రజలు ముక్కున వేలేసుకొంటున్నారు. సిఐ నారాయణరెడ్డి బూతు పురాణంపై ఉన్నతాధికారులకు మున్వర్ బాషా (Munwar Basha) ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని తెలుస్తోంది. సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోన్న ఈ వీడియోపై నారాయణరెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.








