భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు నేడు సెలవు ప్రకటించారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ విద్యాధరి ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తరగతులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జ్ కలెక్టర్ హెచ్చరించారు.
తిరుపతిలో భారీ వర్షం
తిరుపతిలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు జలమయమయ్యాయి, ప్రయాణికులకు రాకపోకలు కష్టంగా మారాయి.