విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్

విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ పై ఎట్టకేలకు హాట్ అప్డేట్ వినిపిస్తోంది. ఎన్నాళ్లుగానో షూటింగ్, ముఖ్యంగా విఎఫ్‌ఎక్స్ పనులతో ఆలస్యమవుతూ వచ్చిన ఈ మూవీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఒక దశలో ఈ సినిమా వస్తుందా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు మేకర్స్ పర్ఫెక్ట్ అవుట్‌పుట్ కోసం కష్టపడుతూ ఫైనల్ టచ్ ఇస్తున్నారని సమాచారం.

‘బింబిసార’తో తన ప్రతిభను నిరూపించుకున్న వశిష్ట, రెండో సినిమాగా ‘విశ్వంభర’ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం, చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో టాలీవుడ్ క్వీన్ త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండటం ఈ సినిమాకు మరింత హైప్ తెస్తోంది. అయితే జూలై 10 రిలీజ్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment