చిరు కొత్త ఫాంటసీ ప్రపంచం – విశ్వంభరపై భారీ అంచనాలు

చిరు కొత్త ఫాంటసీ ప్రపంచం – విశ్వంభరపై భారీ అంచనాలు

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “విశ్వంభర” (Vishwambhara) ప్రస్తుతం టాలీవుడ్‌ (Tollywood)లో హాట్ టాపిక్‌గా మారింది. బింబిసార ఫేమ్ వసిష్ఠ మల్లిడి (Vashishta Mallidi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో, చిరు సరసన కోలీవుడ్ స్టార్ త్రిష (Trisha) నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ (UV Creations Banner)పై వంశీ, ప్రమోద్, నిరంజన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ్యూజిక్ విభాగాన్ని ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి (M.M.Keeravani) భుజాల మీద వేసుకున్నారు.

విశ్వంభర కథా నేపథ్యం ఇలా…
దర్శకుడు వసిష్ఠ ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన కథను అభిమానులతో పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, మనకు తెలిసినట్టుగా 14 లోకాలు ఉంటాయని పురాణాల్లో ఉంది — పైన ఏడు, కింద ఏడు. అయితే ఈ కథలో చెప్పే “విశ్వంభర” అనే లోకం, ఆ 14 లోకాలకూ మించిన సత్య లోకం.

ఈ విశ్వంభర లోకంలో ఉండే ఓ యువతిని వెతుక్కుంటూ హీరో 14 లోకాలను దాటి వెళ్లి, ఆమెను భూమిపైకి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ చిత్ర కథాంశం అని వసిష్ఠ తెలిపారు.

జగదేక వీరుడితో పోలిక?
కథ వినగానే చాలా మంది ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చింది చిరంజీవి నటించిన “జగదేక వీరుడు అతిలోక సుందరి” చిత్రం. అక్కడి కథలో అతిలోక సుందరి భూమికి వస్తే, ఇక్కడ హీరో అతిలోకానికి వెళ్తున్నాడు. తేడా కేవలం దారిలో ఉన్నదే కానీ, పాయింట్ మాత్రం దగ్గరగానే ఉంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

అయితే దీనిపై స్పందించిన వసిష్ఠ, “విశ్వంభర కథ జగదేక వీరుడి కథను పోలి ఉండదు. ఇది పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్. నేను పాత ఫాంటసీ సినిమాల నుండి స్ఫూర్తి పొందాను” అన్నారు.

పాత ఫాంటసీ సినిమాల ప్రేరణ
వసిష్ఠ మాట్లాడుతూ, “అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘కీలు గుర్రం’, ఎన్టీఆర్ పాతాళ భైరవి లాంటి సినిమాల నుండి ప్రేరణ పొందాను. అటువంటి ఫాంటసీ నేపథ్యంలో, ఆధునిక విజువల్స్‌కి తగ్గట్టు కథను రూపొందించాను” అని వివరించారు.

భారీ బడ్జెట్, భారీ అంచనాలు
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు లేని విధంగా, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్‌లో వరల్డ్‌వైడ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది ఈ చిత్రం.

Join WhatsApp

Join Now

Leave a Comment