మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) హీరోగా, అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మెగాఅనిల్’ (MegaAnil) (వర్కింగ్ టైటిల్) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో నయనతార (Nayanthara) కథానాయికగా నటిస్తుండగా, వెంకటేశ్, కేథరిన్, వీటీవీ గణేశ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే జెట్ స్పీడుతో సాగుతోంది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ (Hyderabad)లో, రెండో షెడ్యూల్ ముస్సోరిలో, మూడో షెడ్యూల్ కేరళ(Kerala)లో పూర్తి చేసుకున్నారు మేకర్స్. ఇటీవల కేరళలో జరిగిన షూటింగ్‌లో చిరంజీవి, నయనతార పాల్గొనగా, వారిపై ఓ పాటను చిత్రీకరించారు.
నాలుగో షెడ్యూల్‌లో వెంకటేశ్ భాగస్వామ్యం
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నాలుగో షెడ్యూల్ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్ వర్క్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు సినిమాలోని ప్రధాన తారాగణం పాల్గొంటారని తెలిసింది. ముఖ్యంగా, ఈ షెడ్యూల్‌లోనే వెంకటేశ్ (Venkatesh) పాల్గొనే అవకాశం ఉందని, చిరంజీవి-వెంకటేశ్‌లపై కీలక సన్నివేశాలను అనిల్ రావిపూడి చిత్రీకరించనున్నారని సమాచారం.