‘చిరంజీవిని బూతులు తిట్టిన చౌద‌రి’

చిరంజీవిని బూతులు తిట్టిన చౌద‌రి

ప్ర‌ముఖ‌ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కొణిదెల చిరంజీవి (Konidela Chiranjeevi ) సోష‌ల్ మీడియాలో ఓ వ‌ర్గం చేస్తున్న దారుణ‌మైన కామెంట్ల‌తో మాన‌సిక క్షోభ‌కు గుర‌వుతున్నారు. తనను అసభ్యకరంగా, అవ‌మాన‌క‌రంగా దూషించిన‌ వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చిరంజీవి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్‌ స్టేష‌న్ మెట్లు ఎక్కారు. ఆదివారం రాత్రి చిరంజీవి ఫిర్యాదు సైబర్ క్రైమ్ పోలీసులకు అందింది.

మానసికంగా కలతకు గురైన చిరంజీవి
తనపై సోషల్ మీడియా వేదికలలో అశ్లీల, అసభ్య పదజాలంతో దాడులు జరిపారని, ఇది తన వ్యక్తిత్వం, ఖ్యాతి, గౌరవానికి తీవ్ర భంగం కలిగించిందని చిరంజీవి సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. “Daya Chowdary (@chowdary_daya11)” అనే అకౌంట్‌తో పాటు మరికొన్ని అకౌంట్ల ద్వారా త‌న‌పై, త‌న కుటుంబంపై ఇష్టారీతిగా అస‌భ్య‌క‌ర‌మైన‌ దూషణ‌లు చేస్తున్నార‌ని ఫిర్యాదులో వాపోయారు. ఈ అకౌంట్‌ల వెనుక ఉన్న వ్యక్తులు ఎవ‌రో త‌న‌కు తెలీయ‌ద‌ని, తనకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా తనను లక్ష్యంగా చేసుకొని బూతులు తిడుతున్నార‌ని పేర్కొన్నారు.

ఈ ఘటనపై సైబర్ క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కి చిరంజీవి లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. తన తరఫున జనరల్ కౌన్సెల్ చాగ్లాను విచారణ ప్రక్రియలో ప్రతినిధిగా అనుమతించారు. ఈ అసభ్య వ్యాఖ్యలు మానసిక క్షోభతో పాటు త‌న ప‌రువుకు తీవ్ర‌భంగం కలిగించాయని వివరించారు.

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
రాత్రి 9 గంటల సమయంలో ఫిర్యాదు అందిందని, ప్రాథమిక స్థాయిలో ఆన్‌లైన్ హ్యాండిల్స్‌పై పరిశీలన జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న సోషల్ మీడియా ఖాతాలపై విచారణ పూర్తి చేసిన తరువాత తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment