మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నివాసం (Residence)లో ఈ ఏడాది దీపావళి వేడుకలు (Diwali Celebrations) వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు నాగార్జున, వెంకటేష్ వంటి కొద్దిమంది సినీ ప్రముఖులను మాత్రమే చిరంజీవి ఆహ్వానించారు. వారిలో నయనతార కూడా ఉన్నారు. మొదట చిరంజీవి షేర్ చేసిన ఫొటోలలో కేవలం నయనతార (Nayanthara) మాత్రమే కనిపించడంతో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోయే సినిమాలో ఆమె నటిస్తున్నందున మాత్రమే చిరు ఇంటికి పిలిచారని అంతా అనుకున్నారు.
అయితే, ఈ అంచనాలకు భిన్నంగా, తాజాగా నయనతార తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని అరుదైన ఫొటోలను షేర్ చేశారు. ఆమె తన భర్త విఘ్నేశ్ శివన్, ఇద్దరు పిల్లలతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లి సందడి చేసినట్లు ఆ ఫొటోల ద్వారా తెలిసింది. చిరంజీవితో నయన్ కుటుంబం దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. “ఈ దీపావళి చాలా స్పెషల్‌గా గడిచింది. నా చుట్టూ ఉన్న మనుషులను చూస్తే నా ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగింది” అని నయనతార భావోద్వేగంగా పేర్కొన్నారు.









