రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్పిరిట్ (Spirit Movie). అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Director Sandeep Reddy Vanga) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతుండగా, ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించబోతున్నాడనే టాక్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా తృప్తి డిమ్రి (Tripti Dimri) నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న స్పిరిట్‌ను తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడతో పాటు జపనీస్, కొరియన్ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి 5న సినిమా విడుదలవుతుందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
స్పిరిట్‌లో చిరంజీవి స్పెషల్ రోల్?
స్పిరిట్ సినిమాతో సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర నిడివి దాదాపు 15 నిమిషాల వరకు ఉంటుందని సమాచారం. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో చిరంజీవి కనిపిస్తారని, అందులో ప్రభాస్ తండ్రి పాత్ర (Prabhas Father Role)ను ఆయన పోషిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే, మెగాస్టార్ – రెబల్ స్టార్ కాంబినేషన్ వెండితెరపై చూడాలనే అభిమానుల కల నెరవేరినట్టే. ఇక ప్రభాస్ చివరిగా ది రాజా సాబ్ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో స్పిరిట్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.








