చైనాలో మళ్లీ హెల్త్ ఎమర్జెన్సీ.. వైరస్‌ల తాకిడితో ఆందోళన

చైనాలో మళ్లీ హెల్త్ ఎమర్జెన్సీ.. వైరస్‌ల తాకిడితో ఆందోళన

కరోనా మహమ్మారి వల్ల భయంకరమైన ప్రాణనష్టం ఎదుర్కొన్న చైనా మరోసారి వైరస్‌ల పెనుతాకిడిని ఎదుర్కొంటోంది. మల్టిపుల్ వైరస్‌ల వ్యాప్తితో ఆస్ప‌త్రులు రోగులతో కిక్కిరిసి ఉన్నాయి. కోవిడ్-19తో పాటు ఇన్‌ఫ్లుయెంజా-ఏ, హెచ్ఎంపీవీ, మైకోప్లాస్మా న్యూమోనియా వంటి వైరస్‌లు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. వీటి కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతుండటంతో దేశ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు.

వైరస్‌ల నివారణకు ప్రయత్నాలు
వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చైనా ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. ఆ దేశ అధికార యంత్రాంగం వైరస్‌ల నియంత్రణకు అప్రకటిత యుద్ధమే చేస్తోంది. అయితే, రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన ఇంకా ఎక్కువైంది. ఆస్ప‌త్రులు రోగులకు తగిన చికిత్స అందించడంలో కష్టాలను ఎదుర్కొంటున్నాయి.

మళ్లీ జాగ్రత్తలు..
చైనాలో మల్టిపుల్ వైరస్‌ల వ్యాప్తి యావత్ ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తోంది. ఈ పరిస్థితి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో భయాందోళనలకు కారణమవుతోంది. చైనా ప్రభుత్వ చర్యలు ఈ వైరస్‌ల నియంత్రణలో ఎంతవరకు విజయవంతమవుతాయన్నది ఇప్పటికీ అనుమానంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment