ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని గరియాబంద్ (Gariaband) జిల్లాలో భద్రతా బలగాలు (Security Forces), మావోయిస్టుల (Maoists) మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో డివిజన్ కమిటీ సభ్యుడు ఐతు అలియాస్ యోగేష్ కోర్సా (Aithu alias Yogesh Korsa) మృతి చెందాడు. ఘటనా స్థలంలో భద్రతా దళాలు భారీగా ఎస్ఎల్ఆర్ (SLR) రైఫిళ్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి.
ఆపరేషన్ కగార్ వేగవంతం
మావోయిస్టు నిర్మూలన కోసం నడుస్తున్న ఆపరేషన్ కగార్ (Operation Kagar) దూకుడుగా కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం (Dandakaranya) ప్రాంతం మొత్తమే ప్రస్తుతానికి వార్‌జోన్‌లా మారింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా, ఈరోజు జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ అయిన మనోజ్ టీం కమాండర్ హతమయ్యాడు. గరియాబంద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు, ఆపరేషన్ కర్రెగుట్టలు (Operation Karraguttalu) 13వ రోజుకు చేరింది. బీజాపూర్ (Bijapur) – తెలంగాణ సరిహద్దులోని నీలంసారాయి, దోబిగుట్ట ప్రాంతాల్లో భద్రతా దళాలు దౌత్యంగా ముందుకు సాగుతున్నాయి. అక్కడి నుంచి కర్రెగుట్టలు చేరేందుకు దాదాపు 45 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.
తెలంగాణపై ఆరోపణలు
ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ (Vijay Sharma) కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీల్లో తెలంగాణకు చెందిన కీలక నేతలు ఉన్నారని, వారిని తెలంగాణ నేతలు, అధికార పార్టీ నాయకులు రెస్క్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. తెలంగాణ బార్డర్లో గ్రేహౌండ్స్ (Greyhounds) మానిటరింగ్ సరిగ్గా లేదని విమర్శించారు. ఇక ఈ ఆపరేషన్‌ను నిలిపేయాలని బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సామాజిక కోణంలో చూస్తున్నామని ప్రకటించారు. మాజీ మంత్రి కేకే కూడా లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయ పార్టీలు పెద్దఎత్తున ఆపరేషన్ కర్రెగుట్టలను ఆపాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ఛత్తీస్‌గఢ్ పోలీసులు, భద్రతా బలగాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.








