‘ఛావా’ సినిమా ప్రభావం.. గుప్తనిధుల కోసం తవ్వకాలు!

'ఛావా' సినిమా ప్రభావం.. గుప్తనిధుల కోసం తవ్వకాలు!

బాలీవుడ్ బ్లాక్ బ‌స్టర్ సినిమా ‘ఛావా’ ప్రేక్షకులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతోంది. కొంద‌రు శివాజీ మ‌హ‌రాజ్‌, శంభాజీ మ‌హ‌రాజ్‌ల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుంటుండ‌గా, సినిమాలో క‌నిపించిన వేరొక అంశాన్ని చూసి ప్రేర‌ణ పొందారు. ఈ సినిమాలో చూపించిన ఓ ఆసక్తికరమైన అంశం నిజమేనని నమ్మిన కొంతమంది, నిజంగా కోట వద్ద గుప్తనిధుల కోసం తవ్వకాలు మొదలుపెట్టారు.

మూవీ ప్రభావంతో కోట వద్ద రాత్రుళ్లు తవ్వకాలు!
‘ఛావా’ చిత్రంలో, మొఘలులు మరాఠాలతో జరిగిన యుద్ధంలో దోచుకున్న విలువైన నిధులను మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ ఆసిర్‌గ‌ఢ్ కోటలో భద్రపరిచారని చూపించారు. ఈ విషయం నిజమై ఉండొచ్చని నమ్మిన స్థానికులు, కోట వద్ద రాత్రివేళల కొద్దీ తవ్వకాలు జరిపారు.

ఈ ఘటనపై పోలీసులు అప్రమత్తమై, కోట వద్ద అనుమతి లేకుండా తవ్వకాలు చేపట్టడం నేరమని హెచ్చరించారు. సినిమా ప్రభావం ప్రజలపై ఎంతగా ఉంటుందో ఈ సంఘటన మరోసారి రుజువుచేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment