చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది దుర్మరణం

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది దుర్మరణం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొనడంతో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లతో పాటు 24 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.

ప్రమాద సమయంలో బస్సులో 72 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఢీకొన్న వేళ బస్సులో కంకర పడిపోవడంతో పలువురు ప్రయాణికులు కంకర కింద ఇరుక్కుపోయారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జేసీబీలతో కంకర తొలగింపు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పోలీసులు, స్థానికులు కలిసి క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదం స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనను కలిగించింది. రహదారి దారుణంగా దెబ్బతిన్న బస్సు దృశ్యాలు చూసిన వారందరూ షాక్‌కు గురవుతున్నారు. మరోవైపు, ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గురైన వారి కుటుంబాలకు సాయం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment