నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు శ్రీశైలం, మహానంది పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. భ్రమరాంభిక, మల్లికార్జున స్వామి ఆలయాల సమీపంలో చిరుత సంచరించడాన్ని చూసిన భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇటీవల ఆదివారం మహానంది రోడ్డుపై కూడా చిరుత కనబడడంతో స్థానికులు భయంతో అల్లాడిపోతున్నారు. ఈ ఘటనల వల్ల భక్తుల రద్దీపై ప్రభావం పడుతుందేమోనని అంచనా వేస్తున్నారు.
చిరుతల సంచారంపై అప్రమత్తత
అధికారులు పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు సురక్షిత మార్గాల్లో ప్రయాణం చేయాలని, అడవి ప్రదేశాలకు వెళ్ళడం మానుకోవాలని సూచనలు అందిస్తున్నారు.