---Advertisement---

నిండు గర్భిణి ప్రాణాలు కాపాడిన ChatGPT

ChatGPT, Pregnancy, Health Alert, AI in Healthcare, Viral Stories
---Advertisement---

టెక్నాల‌జీ ఉప‌యోగం.. మెషిన‌రీ లైఫ్‌స్టైల్‌ (Machinery Lifestyle) లో దాని ప్రాముఖ్య‌త‌ను నిపుణులు వివ‌రిస్తూ వ‌చ్చారు. ఉప‌యోగం ఎంతుందో.. న‌ష్ట‌మూ అంతే ఉంద‌ని హెచ్చ‌రిస్తూ వ‌స్తున్నారు. కానీ, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) డెవ‌ల‌ప్ చేసిన చాట్ జీపీటీ (ChatGPT) నిండు గ‌ర్భిణి (Pregnant Woman) ప్రాణాలు (Life) కాపాడింది. న‌మ్మ‌లేక‌పోతున్నారా.. ఇదే నిజం, కావాలంటే ఈ వార్త చ‌ద‌వండి..

అమెరికాలోని (United States) నార్త్ కరోలినాకు చెందిన షార్లెట్ నగరంలో నివసిస్తున్న నటాలియా టారియన్ (Natalia Tarayan) ఎనిమిది నెలల గర్భిణి. ఆమెకు దవడ (Jaw) బిగుతుగా ఉన్న‌ట్లుగా అనిపించి ఆందోళ‌న చెందుతూ.. దీని వెనుక కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవాలని నటాలియా టారియన్ ChatGPTని సంప్రదించింది. ఆమె లక్షణాలను బట్టి ఇది ప్రమాద సూచికగా భావించిన AI, వెంటనే బ్లడ్ ప్రెజర్‌ (Blood Pressure)ను చెక్ చేయాలని సూచించింది.

అంబులెన్సు పిలిచిన దంపతులు
బీపీ తీవ్రంగా పెరిగి ఉండటాన్ని గుర్తించిన నటాలియా, భర్త సహాయంతో వెంటనే అంబులెన్సు (Ambulance) పిలిచారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత ఆమె బీపీ 200/146గా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇది అత్యంత ప్రమాదకరస్థాయి. ఆమె ఆరోగ్య స్థితి తీవ్రమవుతుందన్న అంచనాతో వైద్యులు తక్షణమే ప్రసవం చేశారు. వైద్యుల చొరవ, ChatGPT సూచన వల్ల తల్లీబిడ్డ క్షేమంగా బయటపడ్డారు. దీంతో న‌టాలియా దంప‌తులు ChatGPTకి ధ‌న్య‌వాదాలు (Thanks) తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment