ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు సీఎం సీరియ‌స్‌ వార్నింగ్

ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు సీఎం సీరియ‌స్‌ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. తీరు మార్చుకోవాల‌ని సీరియ‌స్‌ వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీ ప్రతినిధులు ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. “ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు” అని సీఎం హెచ్చరించారు. ఫైళ్ల పరిష్కారంలో కూడా కొందరు మంత్రులు అలసత్వం చూపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో ఫైల్ పరిష్కారానికి ఎంత సమయం తీసుకుంటున్నారో తన వద్ద లెక్కలున్నాయని, ఇకపై నిర్ణీత వ్యవధిలో ఫైళ్లు క్లియర్ చేయాలని ఆదేశించారు.

త‌ల‌నొప్పిగా మారిన ఎమ్మెల్యేలు
ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారాలు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ వీడియో కాల్ వివాదం, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ శాఖ సిబ్బందిపై దాడి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లి గురించి అసభ్య పదజాలం ఉపయోగించడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని, ఇటువంటి చర్యలు భరించబోమని చంద్రబాబు కేబినెట్ మీటింగ్‌లో హెచ్చ‌రించిన‌ట్లుగా స‌మాచారం.

లోకేష్ అనుచ‌రుడ‌నా..?
అయితే దగ్గుపాటి ప్రసాద్ విషయంలో మాత్రం టీడీపీ తేలికపాటి వైఖరిని అవలంబించడం విమర్శలకు దారితీస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పై బూతులు తిట్టినా, ఆయన తల్లి పై దారుణ వ్యాఖ్యలు చేసినా ఎమ్మెల్యేపై పార్టీ నుండి సస్పెన్షన్ గానీ, కేసు గానీ నమోదు కాలేదు. ఆయనకు మంత్రి నారా లోకేష్ సన్నిహితుడిగా ఉండటమే కారణమని పార్టీ లోపలే చర్చ నడుస్తోంది. ప్రజల ఆగ్రహం పెరుగుతున్న నేపథ్యంలో దగ్గుపాటి పై చర్యలు తీసుకోకపోవడంపై టీడీపీ నేతృత్వం గట్టి విమర్శలు ఎదుర్కొంటోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment