“అమరావతి (Amaravati) ఓ మున్సిపాలిటీ (Municipality)గా మిగిలిపోకుండా, పరిపాలనా కేంద్రంగా, అభివృద్ధి ప్రాతిపదికగా మారుతుంది. రైతులు (Farmers) చేసిన త్యాగాలను నేను ఎప్పటికీ మరిచిపోను” అని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. అమరావతిలో సీఆర్డీఏ (CRDA) కార్యాలయాన్ని(Office) సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “అమరావతి రైతుల త్యాగాల ఫలితంగానే నేడు ఈ భవనం ఆవిష్కృతమైంది” అని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని పరిస్థితుల్లో విజయవాడ–గుంటూరు (Vijayawada–Guntur) మధ్య ప్రాంతాన్ని అనువైనదిగా గుర్తించి, ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “హైదరాబాద్ (Hyderabad)లో హైటెక్ (Hi-Tech) సిటీ(City) కట్టినప్పుడు అందరూ నవ్వుకున్నారు. కానీ నేడు ఆ విజన్ వల్ల తెలంగాణకు 70 శాతం ఆదాయం వస్తోంది. ఇప్పుడు అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా నిర్మిస్తాం” అన్నారు. రాజధాని నిర్మాణంలో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి గొప్ప చరిత్ర సృష్టించారని గుర్తుచేశారు. “ల్యాండ్ పూలింగ్ మోడల్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో భూసమీకరణ జరగడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి,” అని సీఎం అన్నారు.
అమరావతిని పర్యావరణ అనుకూల, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని సీఎం తెలిపారు. విద్యుత్ తీగలు, గ్యాస్ పైపులు, కేబుళ్లు అన్నీ భూగర్భంలోనే ఉండే ఆధునిక రాజధాని రూపుదిద్దుకుంటోందని చెప్పారు. మిమ్మల్ని మరిచిపోతే మీ త్యాగాలను మరిచిపోయినట్టే.. మీ త్యాగాల్ని గుర్తుపెట్టుకుంటా..మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా అంటూ రైతులకు హామీ ఇచ్చారు.








