సీఎం చంద్రబాబు టంగ్‌స్లిప్‌.. వీడియో వైర‌ల్‌

సీఎం చంద్రబాబు టంగ్‌స్లిప్‌.. వీడియో వైర‌ల్‌

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) చేసిన ఒక వ్యాఖ్య ప్రస్తుతం రాజకీయంగా తీవ్రమైన చర్చకు దారితీసింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెం (Veerayapalem)లో నిర్వహించిన “అన్నదాత సుఖీభవ పథకం” (Annadata – Sukhibhava Scheme) ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ “నేనున్నంతవరకు రైతుకు భరోసా లేదు, ఉండదు, ఉండ‌బోదు” అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్(Viral) అయ్యాయి. అయితే ఈ వీడియోపై వైసీపీ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది. చంద్ర‌బాబు త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌హిరంగంగా రైతుల ముందే బ‌య‌ట‌పెట్టేశార‌ని సెటైర్లు వేస్తోంది.

ఈ వ్యాఖ్యల తర్వాత రైతుల్లో కలకలం రేగింది. సభలో ఉన్న కొందరు ఒక్కసారిగా అయోమయంలో పడిపోయారు. “చంద్రన్న ఉన్నంతవరకు రైతుకు భరోసా లేదు” అన్న వీడియోపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. “ఇది చంద్ర‌బాబు త‌న‌కు తాను అంగీకరించిన నిజం, ఇక‌నైనా ప్రజలు గమనించాలి” అంటూ విపక్షాలు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. మరికొందరైతే “ఇది అనుకోకుండా జరిగిన మాటల పొరపాటు మాత్రమే” అని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు.

వాస్తవానికి చంద్రబాబు ఉద్దేశం “చంద్రన్న ఉన్నంతవరకు రైతుకు భరోసా ఉంటుంది” అని చెప్పడమేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ, రాజకీయ వేదికపై ఇలాంటి మాటల తడబాటు ప్రతికూల ప్రభావమే మిగుల్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment