బాబా మహాసమాధిని దర్శించుకున్న సీఎం, మంత్రి

బాబా మహాసమాధిని దర్శించుకున్న సీఎం, మంత్రి

కొత్తచెరువు (Kottacheruvu)లోని జడ్పీ ఉన్నత పాఠశాల (ZP High School)లో మెగా పీటీఎం (Mega PTM) 2.0 అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu)తో కలిసి విద్య శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పుట్టపర్తిలోని ప్రశాంతి (Prashanthi Ashram) నిలయాన్ని సందర్శించారు. సాయి కుల్వంత్ (Sai Kulwant) మందిరంలోని శ్రీ భగవాన్ (Sri Bhagawan) సత్యసాయి బాబా (Sathya Sai baba) మహాసమాధిని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి దర్శించుకున్నారు. ప్రార్థనలు చేశారు.

అనంతరం ఓంకార్ (Omkar) మందిరంలో కొద్దిసేపు గడిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ (R.J Ratnakar) తో పాటు మంత్రి కె.అచ్చెన్నాయుడు, ఎంపీ బీకే పార్థసారథి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు శాంతిభవన్ అతిథిగృహంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment