ప్ర‌జ‌ల‌కు చిల్లిగవ్వ ఇవ్వని వ్యక్తులు పీ4పై విమర్శలా?

ప్ర‌జ‌ల‌కు చిల్లిగవ్వ ఇవ్వని వ్యక్తులు పీ4పై విమర్శలా?

ప్ర‌జ‌ల‌కు (People) సంక్షేమ ప‌థ‌కాల (Welfare Schemes) రూపంలో ఒక్క చిల్లిగవ్వ కూడా ఇవ్వని వారు పీ-4 విధానాన్ని (P-4 Policy) విమర్శిస్తున్నారని ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మండిపడ్డారు. పేదరికం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తుంటే.. దాన్ని అడ్డుకునేందుకు కొందరు రకరకాల విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. కుప్పం (Kuppam)లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు వివిధ అంశాలపై స్పందించారు.

సీఎం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. “పేదల్ని ఆదుకునేందుకు మార్గదర్శకుల్ని అన్వేషిస్తుంటే త‌మ ప్ర‌భుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ వనరుల్ని దోచుకోవడం తప్ప చిల్లిగవ్వ ఖర్చు పెట్టని వాళ్లు రాజకీయాలు చేస్తున్నారు. సామాజిక బాధ్యత కింద సమాజానికి ఏదైనా చేస్తూనే ఉండాలి. గతంలో జన్మభూమి పిలుపునిచ్చాను, ఇప్పుడు పీ4 పేరిట కార్యక్రమం చేపట్టాం. గతంలో నేను చేసిన సాయంతో బాగా చదువుకుని అమెరికాకు వెళ్లి డబ్బులు సంపాదించిన వ్యక్తులు ఇప్పడు మార్గదర్శకులుగా మారుతున్నారు” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఐదేళ్ల‌లో రూ.2.72 ల‌క్ష‌ల కోట్లు డీబీటీ(DBT) ద్వారా సంక్షేమ ప‌థ‌కాల రూపంలో సాయం అందించిన గ‌త ప్ర‌భుత్వంపై సీఎం చంద్ర‌బాబు చిల్ల‌గ‌వ్వ ఇవ్వ‌లేద‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

బనకచర్లతో ఎలాంటి నష్టం లేదు
బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project)తో ఎవరికీ నష్టం లేదు.. కొందరు దీనిపై అనవసరపు రాద్దాంతం చేస్తున్నారని సీఎం చంద్ర‌బాబు అన్నారు. తెలంగాణాలో చాలా ప్రాజెక్టులకు నేనే శంకుస్థాపనలు చేశాన‌ని, గోదావరిలో నీళ్లు ఎగువన ఉన్న రాష్ట్రాలు, దిగువన ఉన్న రాష్ట్రాలూ వినియోగించుకోవచ్చని చెప్పారు. పేదలకు ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా అత్యాధునిక సౌకర్యాలనూ పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామ‌ని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో ఇంటింటికీ ఏడాదిలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాన‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment