సీఎం కరకట్ట నివాసానికి రూ.కోటీ 7 లక్షలు.. నెట్టింట‌ విమ‌ర్శ‌లు

సీఎం కరకట్ట నివాసానికి రూ.కోటీ 7 లక్షలు.. నెట్టింట‌ విమ‌ర్శ‌లు

ఉండ‌వ‌ల్లిలోని సీఎం చంద్రబాబు కరకట్ట నివాసం మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీ నిధులు మంజూరు చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం, కరకట్ట ప్యాలెస్ మరమ్మతులు, సౌకర్యాల మెరుగుదల కోసం ఏకంగా రూ.1.07 కోట్లు మంజూరు చేసింది. ఇదే భవనంపై ఇప్పటికే రూ.2.65 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, మరోసారి ప్రజా ఖజానా నుంచి కోటీ 7 ల‌క్ష‌ల రూపాయ‌లు ఖర్చు చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది.

ఇటీవలే సీఎం చంద్రబాబు ఢిల్లీ నివాసం పునరుద్ధరణకు రూ.95 లక్షలు వెచ్చించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉండ‌వ‌ల్లిలోని కరకట్ట ప్యాలెస్‌పై అదనంగా ప్ర‌భుత్వ నిధులు మంజూరు చేయడంపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “ప్రజా ప్రభుత్వం”, “సీఎం అంటే కామన్‌మెన్‌” అంటూ ప్రచార వీడియోలు విడుదల చేస్తున్న టీడీపీ, వాస్తవానికి విలాసవంతమైన నివాసాలపై ప్రజా డబ్బుతో దుబారా చేస్తోందని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసాలపై విమర్శలు గుప్పించిన టీడీపీ.. ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతుంద‌ని ప్రతిపక్షం ప్ర‌శ్నిస్తోంది. కరకట్ట నివాసం ప్రభుత్వ నిధులతో మరమ్మతు చేయించడంపై “ప్రజల డబ్బుతో వ్యక్తిగత సౌకర్యాలు ఎందుకు?” అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా నిధులు ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయాలే తప్ప, రాజకీయ నాయకుల విలాసం కోసం కాదని విమర్శకులు పేర్కొంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment