ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలో అత్యంత సంపన్న సీఎంగా గుర్తింపు పొందిన సంగతి ఇటీవలే ఏడీఆర్ రిపోర్ట్ ద్వారా వెలుగుచూసింది. అయితే, ఈ విషయంపై మాజీ మంత్రి ఆర్.కే. రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండు ఎకరాల ఆసామి కొడుకు అయిన చంద్రబాబు అవినీతి లేకుండా రూ.931 కోట్లు ఎలా సంపాదించారు?’ అంటూ రోజా ట్వీట్ చేశారు. చంద్రబాబు ఏవిధంగా కోట్లాది ఆస్తులను ఎలా సమకూర్చుకున్నారో దేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ADR) నివేదిక ప్రకారం, చంద్రబాబు రూ.931 కోట్ల ఆస్తులతో దేశంలో అత్యధిక సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. ఈ నివేదిక రాజకీయ నాయకుల ఆర్థిక పరిస్థితులపై పలు చర్చలకు దారితీసింది. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే అత్యధిక ధనిక సీఎంగా నిలవడంతో ఏపీలో ప్రత్యర్థి పార్టీలు ఆయనపై విమర్శలు చేస్తున్నాయి. అంత డబ్బు ఎలా కూడబెట్టారు, ఎలా సంపాదించారంటూ ప్రశ్నలు సంధిస్తున్నాయి.