కూటమి పాలనలో వింత సంఘటన చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం రిటైర్ అయిన మంత్రి అచ్చెన్నాయుడి సోదరుడికి మళ్లీ ప్రభుత్వ కొలువు వచ్చింది. రిటైర్ అయ్యాక కూడా ప్రభాకర్‌కు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ఉద్యోగమిచ్చింది. గత కొద్ది రోజుల క్రితం మంత్రి అచ్చెన్నాయుడు తమ్ముడు ప్రభాకర్ ఉద్యోగ విరమణ చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డిపార్టుమెంట్ OSDగా ప్రభుత్వం నియమించింది. విజిలెన్స్ కేసులతో కక్ష సాధింపు కోసమే మంత్రి అచ్చెన్నాయుడు తమ్ముడు కింజరాపు ప్రభాకర్‌ను నియమించినట్లుగా తెలుస్తోంది.
కారణం ఇదేనా..?
ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తికి మళ్లీ పిలిచి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నియామకం కేవలం వైసీపీ నేతలుగా టార్గెట్ జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అచ్చెన్న తమ్ముడిని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీపై పగ తీర్చుకునేందుకు చంద్రబాబు ఈ నియామకం చేసినట్లుగా వైసీపీ ఆరోపిస్తోంది.

అచ్చెన్న ఇంట్లోనే నాలుగు పదవులు..
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కుటుంబానికి కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్లు ప్రకటిస్తోంది. టీడీపీ అధికారంలోకి రాగానే అచ్చెన్నాయుడు మంత్రి అయ్యారు, ఆయన అన్న కుమారుడు కేంద్రమంత్రి అయ్యారు.. రామ్మోహన్ నాయుడు బావ ఎమ్మెల్యే అయ్యాడు. తాజాగా రిటైర్ అయిన అచ్చెన్నాయుడు తమ్ముడు ప్రభాకర్ ఓఎస్‌డీ అయ్యారు.







