ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు భారీ ప్రైజ్‌మనీ

ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు భారీ ప్రైజ్‌మనీ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో నేడు దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ కీలక గెలుపొందే జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారీ మొత్తం ప్రైజ్‌మనీ ప్రకటించింది. అధికారిక సమాచారం ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టుకు రూ. 19.48 కోట్లు ప్రైజ్‌మనీ లభించనున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఫైనల్‌లో ఓడిపోయిన రన్నరప్ జట్టు రూ. 9.74 కోట్లు పొందుతుంది. సెమీ ఫైనల్ వరకు వ‌చ్చి ఓడిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లకు రూ. 4.87 కోట్లు చొప్పున అందించనున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. దుబాయ్ వేదిక‌గా భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య ఆఖ‌రిపోరు జ‌ర‌గ‌నుండ‌గా, ఇప్ప‌టికే టీమిండియా ఫ్యాన్స్ భార‌త్ గెలుపు కోసం దేవాల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్నారు. 12 ఏళ్ల క‌ల‌ను టీమిండియా నెర‌వేర్చుకోనుందా.. గేమ్‌లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment