బాలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన ‘ఛావా’(Chhaava) మూవీ రూ.480 కోట్లపైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను గీతాఆర్ట్స్(Geetha Arts) తన బ్యానర్‌పై రిలీజ్ చేసింది. శుక్రవారం విడుదలైన ఛావా సినిమా తెలుగు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది.
డబ్బింగ్‌పై నెగటివ్ కామెంట్స్
తెలుగు వెర్షన్‌లో డబ్బింగ్ పరంగా చాలా లోపాలు ఉన్నాయని ప్రేక్షకులు సోషల్ మీడియాలో పెదవి విరుస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా డైలాగులు రాయలేదని, దీంతో సినిమా ఇంపాక్ట్ తగ్గిపోయిందని అంటున్నారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ భారీ ఎత్తున విడుదల చేసినప్పటికీ, తొలి రోజు రూ.3 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమా ఫుల్ రన్‌లో మంచి వసూళ్లు సాధిస్తుందా లేదా అనేది చూడాలి.