మతపరమైన హింస నుంచి తప్పించుకుని భారతదేశానికి వలస వచ్చిన పాకిస్తాన్ (Pakistan), ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan), బంగ్లాదేశ్ (Bangladesh) దేశాల మైనారిటీలకు (Minorities) కేంద్ర హోం శాఖ శుభవార్త తెలిపింది. వీసా, పాస్‌పోర్ట్ లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేకుండానే దేశంలో ఉండటానికి అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ మినహాయింపు హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు వర్తిస్తాయి. డిసెంబర్ 31, 2024 వరకు భారతదేశానికి వచ్చిన వారందరికీ వర్తిస్తాయి.
CAAతో అనుసంధానం
గత సంవత్సరం అమలులోకి వచ్చిన పౌరసత్వ (సవరణ) చట్టం (CAA) ప్రకారం, డిసెంబర్ 31, 2014న లేదా అంతకు ముందు భారతదేశానికి వచ్చిన మైనారిటీలకు భారత పౌరసత్వం లభిస్తుంది. ఇప్పుడు ఈ కొత్త ఉత్తర్వు 2014 తర్వాత వలస వచ్చినవారికి కూడా ఊరట కల్పిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులకు ఇది ఎంతో ఉపశమనం. ఇమ్మిగ్రేషన్, విదేశీయుల చట్టం 2025 కింద ఈ మినహాయింపును కల్పించారు.








