పన్నుల్లో వాటా కింద రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం రూ.1,73,030 కోట్ల నిధులు విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,002 కోట్లు, తెలంగాణకు రూ.3,637 కోట్లు కేటాయించింది.
నిధుల కేటాయింపుపై వివాదం
కేంద్రం ఈ నిధులను రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం మరియు మూలధన వ్యయాల కోసం విడుదల చేస్తూ, తమ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని పేర్కొంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఈ నిధుల కేటాయింపుపై అసహనం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌కు అధిక నిధులు కేటాయించడం తెలంగాణను కొంత నిరాశకు గురిచేస్తోంది.
ఈ అంశంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తీవ్రంగా మండిపడుతూ, కేంద్రం తెలంగాణపై చిన్నచూపు చూపిస్తోందని ఆరోపిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఈ నిధులను రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాల అభివృద్ధి/సంక్షేమం కోసం ఆర్థిక సహాయం అందించేందుకు విడుదల చేసినట్లు తెలిపారు.