ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం (Central Cabinet Meeting)లో దేశ వ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ (Infrastructure) మరియు హైటెక్ (Hi-Tech) తయారీ రంగాలకు ఉత్తేజాన్ని ఇచ్చే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం రూ.19,919 కోట్లు విలువైన నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) మీడియాకు వెల్లడించారు.
రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్‌కి రూ.7,280 కోట్లు
హైటెక్ రంగానికి అవసరమైన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల తయారీ Rare (Earth Magnet Production)కి కేంద్రం భారీగా ₹7,280 కోట్లు కేటాయించింది. ఈ ఆధునిక మ్యాగ్నెట్లు ఎలక్ట్రిక్ వెహికల్స్, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, డిఫెన్స్ టెక్నాలజీస్ వంటి అనేక కీలక పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగపడతాయి. ఇప్పటి వరకు భారత్(India) ఎక్కువగా ఇలాంటి మ్యాగ్నెట్ల కోసం విదేశాలపై ఆధారపడేది. కొత్త ప్రాజెక్ట్ ద్వారా దేశీయ ఉత్పత్తి పెరుగడంతో దిగుమతి భారం తగ్గనుంది.
పుణె మెట్రో విస్తరణకు ₹9,858 కోట్లు
పుణె నగర ప్రజలకు సంతోషకర వార్త. పుణె మెట్రో (Pune Metro) విస్తరణ ప్రాజెక్ట్‌కు కేబినెట్ భారీగా ₹9,858 కోట్లు కేటాయించింది. కొత్త మెట్రో లైన్ పొడవు 32 కిలోమీటర్లు. ఖరడి – ఖడక్వాస్లా, నల్ స్టాప్ – మాణిక్ బాగ్ మీదగా నిర్మాణాలు చేపట్టనుంది. ఈ లైన్ పూర్తయ్యే సరికి పుణెలో రోజురోజుకీ తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యకు గణనీయంగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.








