జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు చోటు దక్కింది. కమిటీలో రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలకు అవకాశం ఇవ్వగా, అందులో ఏపీ నుంచి వైసీపీ తరఫున విజయసాయిరెడ్డి, జనసేన ఎంపీ బాలశౌరి, టీడీపీ ఎంపీ బాలయోగి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌లు ఉండగా, తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌కు అవకాశం కల్పించారు.
జమిలి ఎలక్షన్ (వన్ నేషన్ – వన్ ఎలక్షన్) బిల్లును జేపీసీకి పంపడంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటు ప్రకారంగా తీర్మానం ఆమోదం పొందింది. అనంతరం జమిలి బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంట్ కమిటీ(JPC)కు పంపించనున్నారు.
జాయింట్ పార్లమెంటరీ కమిటీలో లోక్‌సభ నుంచి 21మంది, రాజ్యసభ నుంచి 10మంది ఉంటారని ప్రకటించిన కేంద్రం, తరువాత లోక్‌సభ నుంచి 27మంది, రాజ్యసభ నుంచి 12మంది ఉంటారని ప్రకటించింది. లోక్‌సభలోనూ జమిలి ఎన్నికల బిల్లు జేపీసీకి పంపించడానికి ఆమోదం పొందిన విషయం తెలిసిందే.