ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్లేయర్స్ అండ్ ఆడియన్స్ కోసం కూల్డింక్స్ విభాగంలోని స్పాన్సర్షిప్ హక్కులను ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) ఆధ్వర్యంలోని రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL) దక్కించుకుంది. ఈ డీల్ కోసం రిలయన్స్ దాదాపు రూ.200 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.
గతేడాది వరకు ఈ స్పాన్సర్ షిప్ హక్కులు కోకాకోలా(Coca-Cola) వద్ద ఉండగా, ఇప్పుడు వాటిని రిలయన్స్ (Reliance) స్వాధీనం చేసుకోవడంతో RCPL ఐకానిక్ డ్రింక్స్ బ్రాండ్ కంపాకోలా (Campa Cola)కి మరింత ప్రచారం లభించే అవకాశం ఉంది. IPL ద్వారా దేశవ్యాప్తంగా ఉత్పత్తిని విస్తరించే లక్ష్యంతో రిలయన్స్ ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.
IPL ప్రేక్షకుల్లో పానీయాల బ్రాండ్ల ప్రాచుర్యం ఎక్కువగా ఉండటంతో, ఈ స్పాన్సర్షిప్ రిలయన్స్ విక్రయాలను పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందంతో మార్కెట్లో కోకాకోలా మరియు రిలయన్స్ మధ్య మరింత పోటీ పెరిగే అవకాశం ఉంది.