ముగ్గురికి కేబినెట్ హోదా.. జీవో విడుదల

ముగ్గురికి కేబినెట్ హోదా.. జీవో విడుదల

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురికి కేబినెట్ హోదా కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

కేబినెట్ హోదా లభించిన వారిలో ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కేఎస్ జవహర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ ఉన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment