యువ నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించారు. ‘మిత్రమండలి’ (Mithramandali) సినిమా (Movie) ప్రీ-రిలీజ్ (Pre-Release) ఈవెంట్లో మాట్లాడిన ఆయన మాటలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తన సినిమా మీద కావాలనే చిత్రసీమకు చెందిన కొందరు డబ్బులు పెట్టి నెగటివ్ ప్రచారం చేస్తున్నారని, ట్రోలింగ్ చేసినా తాను పడిపోడని బన్నీ వాసు స్పష్టం చేశారు. “నా వెంట్రుక కూడా పీకలేరు” అని ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) డైలాగ్ (Dialogue) కొట్టి సెన్సేషనల్‌గా మారాడు. బన్నీ వాసు డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
బన్నీ వాసు మాట్లాడుతూ.. “మిత్రమండలి సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబర్ 16న రిలీజ్ చేస్తున్నాం. ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. డైరెక్టర్ విజయేంద్ర (Vijayendra) మంచి మనసున్న వ్యక్తి, ఆయనతో పని చేయడం గర్వంగా ఉంది. అన్ని సినిమాలు బాగానే ఆడాలి, ప్రేక్షకులే తుది తీర్పు చెబుతారు. కానీ కొందరు ట్రైలర్ కింద ‘ఎక్కడ నవ్వాలో చెప్పండి’ అని కామెంట్లు పెడుతున్నారు. వాళ్లకు నా సవాల్ – ముందు సినిమా చూసి నవ్వకపోతే అప్పుడే కామెంట్ చేయండి. థియేటర్లో ప్రతి నిమిషం నవ్వుతారు” అని తెలిపారు.
ట్రోలింగ్కి కౌంటర్‌గా బన్నీ వాసు మాట్లాడుతూ.. “ఎవరినైనా తొక్కితేనే నేను పడిపోతానని అనుకుంటే అది మీ భ్రమ. నా వెంట్రుక కూడా పీకలేరు. నేను పరిగెడుతూనే ఉంటాను, అదే నా గెలుపు. సినిమా మీద డబ్బులు పెట్టి నెగటివ్ ట్రోలింగ్ చేయడం చిన్నపిల్లల తత్వం. సినిమా బాగుంటే ప్రజలు చూస్తారు, లేదంటే కాదు. దేవుడు, ప్రేక్షకులే నిజమైన జడ్జ్‌లు. ఎవరు ఎంత ట్రోలింగ్ చేసినా నాకు వందనం. ఎందుకంటే నేను పాజిటివ్ ఎనర్జీతోనే ముందుకు సాగుతాను,” అని బన్నీ వాసు స్పష్టంగా అన్నారు.







