బన్నీకి మ‌ళ్లీ నోటీసులు.. ఫ్యాన్స్ అసహనం

బన్నీకి మ‌ళ్లీ నోటీసులు.. ఫ్యాన్స్ అసహనం

సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో మ‌ర‌ణించిన రేవ‌తి కుటుంబాన్ని పరామర్శించలేదన్న కారణంగా సీఎం రేవంత్ సహా పలువురు అల్లు అర్జున్‌పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రెగ్యుల‌ర్ బెయిల్ పొందిన బ‌న్నీ, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్‌ను కలవబోతున్నారన్న సమాచారంతో పోలీసులు అల్లు అర్జున్‌ను ఆపేందుకు నోటీసులు పంపారు.

ఈ పరిణామంపై బన్నీ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో పట్ల ఒకసారి ఇలా, మరొకసారి అలా వ్యవహరించడం తగదని ఫైరవుతున్నారు. ఇది స్పష్టంగా అసమానతను చూపుతుందంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment